16-11-2023 Srinu
తెలంగాణ
తెలంగాణలో అన్ని స్థానాలకు పోటీ చేస్తామన్న తెలంగాణ జన సమితి పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత హఠాత్తుగా పోటీ నుండి తప్పుకుని కాంగ్రెస్ కు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ప్రకటన చేయడానికి ముందు కరీంనగర్ లో రాహుల్ గాంధీతో భేటీ అయిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం సమావేశం అయ్యారు. కాంగ్రెస్ కు మద్ధతు పలికేందుకు తీర్మానించుకున్నారు. ఈ క్రమంలో జరిగిన చర్చల్లో కాంగ్రెస్ పార్టీ ముందు ఆరు అంశాలను పెట్టామని,
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాటిని అమలు చేసేందుకు హమీ ఇచ్చిందని కోదండరాం తెలిపారు. నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలకు అందించాలని, కుటీర పరిశ్రమల ఎదుగుదలకు కృషి చేయాలని, సాంప్రదాయ వృత్తులు, రైతులకు ఆదాయ భద్రత కల్పించాలని, రైతుల భూములకు రక్షణ, ప్రజాస్వామ్య పాలన నెలకోల్పాలని, ఉద్యమ కారులకు సంక్షేమ కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్న ఆరు డిమాండ్ల అమలుకు హస్తం పార్టీ ఓకే చెప్పినందుకే ఈ ఎన్నికల్లో తాము పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్ధతు ఇస్తున్నట్లు కోదండరాం చెప్పారు.