17-11-2023 Srinu
ఆంధ్రప్రదేశ్
విద్యాదీవెన డబ్బులు విడుదల చేయాలని డిమాండ్
విద్యా సంవత్సరం మొదలై నెలలు గడుస్తున్నా విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకపోవడాన్ని నారా లోకేష్ విమర్శించారు, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సన ఫీజు బకాయిలు రూ.1650 కోట్లు పెండింగ్‌లో ఉండడం వలన వారిని కాలేజీ యాజమాన్యాలు పరీక్షలు రాయనివ్వకుండా అడ్డుకుంటున్నాయని, వారి సర్టిఫికెట్ల జారీ నిలిపివేశాయని.. దాని వలన వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని లోకేష్ అన్నారు. పై చదువులకు, ఉద్యోగాలకు వెళ్లే వారికి సర్టిఫికెట్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారి ఆందోళనను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరారు.