17-11-2023 Srinu
ఆంధ్రప్రదేశ్
- టీడీపీ తీవ్ర ఆరోపణలు
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీవారం ఆదాయాన్ని తన కుమారుడి ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారని తెలుగు దేశం పార్టీ ఆరోపించింది. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంటరమణారెడ్డి కీలక వివరాలు వెల్లడించారు.
శ్రీవారి ఆలయం సొమ్ముని తన కుమారుడు అభినయ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నారని తెలిపారు. టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన స్థలాల చుట్టూ అభినయ్ 5.45 ఎకరాలు ఎలా కొనుగోలు చేశారో చెప్పాలని ఆనం డిమాండ్ చేశారు.
తిరుమలేశుని ఆదాయంతో.. తిరుపతి కార్పోరేషన్ వేయాల్సిన రోడ్లను తిరుమల వెంకన్న సొమ్ముతో వేస్తున్నారని.. ఇలా చేసే అధికారం భూమనకు ఎవరిచ్చారని ఆనం ప్రశ్నించారు. అభినయ్ రెడ్డి రాజకీయ జీవితం కోసం శ్రీవారి నిధుల నుండి రూ.150 కోట్లతో తిరుపతిలో ఇంటర్నల్ రోడ్లు వేస్తున్నారని మండిపడ్డారు.
టీటీడీ చైర్మన్‌గా ఉన్న కరుణాకర్ రెడ్డి ఇప్పటివరకు ఇలా ఎంత స్వామివారి సొమ్ముని దారి మళ్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీవారి ఆదాయాన్ని ఇతర పనులకు వినియోగించడం ఒక తప్పయితే.. ఆ పనుల కాంట్రాక్టులో 10 శాతం కమీషను్ల తీసుకోవడం మరో తప్పు అని ఆరోపించారు.