17-11-2023 Super
తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేనిఫెస్టో విడుదలకు సమయం ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరు హామీల పేరుతో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్.. మేనిఫెస్టో విడుదల చేసి ప్రజలకు చేరువ కావాలన్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.౩౦ గంటలకు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మేనిఫెస్టోను విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రేపు బీజేపీ మేనిఫెస్టో విడుదల కానుంది.
గాంధీభవన్ లో మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. మ్యానిఫెస్టోను అన్ని వర్గాలతో సంప్రదించి రూపొందించినట్లు, దీన్ని తెలంగాణ ప్రజలకి అంకితం చేస్తున్నట్టు తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలాకు ఈ మేనిఫెస్టో ఉత్కృష్టమైన పత్రం అని ఆయన పేర్కొన్నారు. అభయహస్తం పేరిట విడుదల చేసిన ఈ మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చాక తూచ తప్పక అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దాదపు 38 పాయింట్లతో కూడిన ఈ మేనిఫెస్టో లో ఆరు గ్యారంటీలు, రైతు, యువత, SC, ST, మైనారిటీ, BC, డిక్లరేషన్లు ప్రాధానంగా పొందుపరిచారు.
రంగాల వారీగా తమ ప్రభుత్వ కార్యాచరణను కాంగ్రెస్ ప్రకటించింది. ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు ఉద్దేశ్యాలను సంపూర్ణంగా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర సంపదను అందరికీ పంచే ఉద్దేశ్యంతో అభయహస్తాన్ని సిద్దం చేసినట్లు చెప్పారు.