17-11-2023 Super
తెలంగాణ
- సొంతగూటికె మాజీ మేయర్ గుండా ప్రకాశ్
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం లో కీలక నేత అయిన మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ బాట పట్టారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన గుండా ప్రకాష్ రావు, ఆ తరువాత తెలంగాణ ఉద్యమం సమయంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అనేక ముఖ్యమైన పదవులలో కూడా ఆయన కీలకంగా పనిచేశారు.
వరంగల్ నగరపాలక సంస్థ మేయర్ గా పని చేశారు. పార్టీలో కీలక నేతగా సీనియర్ నేతగా పేరున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆయనకు సరైన గౌరవం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ఏకపక్ష ధోరణితో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన తాజాగా పార్టీ మారనున్నట్టు తెలిపారు.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, వరంగల్ తూర్పు నియోజకవర్గం లో జరిగే కార్నర్ మీటింగ్లో రాహుల్ గాంధీ సమక్షంలో గుండా ప్రకాష్ రావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.