17-11-2023 Super
తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సనత్ నగర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించామని సనత్ నగర్ MLA అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
శుక్రవారం రాత్రి అమీర్ పేట డివిజన్ శ్రీరాం నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా కంటే ముందు ఇక్కడ గెలిచి ముఖ్యమంత్రి గా, కేంద్రమంత్రిగా ఉండి కూడా అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు.
తాను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి KTR గార్ల సహకారంతో గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో చేశామని తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి లో ఆదర్శంగా నిలపాలనేది తన లక్ష్యం అన్నారు. తాను వచ్చిన తర్వాత నియోజకవర్గ పరిధిలో అన్ని రోడ్లను CC రోడ్లుగా అభివృద్ధి చేసినట్లు వివరించారు.
తెలంగాణ రాష్ట్రం నుండి అత్యధిక ఆదాయం పొందుతున్నదని కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతుందని ఆరోపించారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలలో తనను గెలిపించిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. తమ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసి అన్ని విధాలుగా తమకు అండగా ఉండే తలసాని శ్రీనివాస్ యాదవ్ కే తమ పూర్హి మద్దతు అని సమావేశంలో ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, కాలనీ ప్రతినిధులు కుమార్, చెన్నయ్య, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.