17-11-2023 Srinu
తెలంగాణ
ముధోల్: నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని భైంసా పట్టణంలో శనివారం నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాజరు కానున్నారు.
శనివారం బైంసాలో జరగనున్న బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించనున్నారు. బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ తరఫున ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. గత ఏడాది బండి సంజయ్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర భైంసా నుండి కొనసాగించగా.. సరిగ్గా సంవత్సరం తర్వాత మళ్లీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో భైంసా భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు.
ఈ సందర్భంగా సభ ప్రాంగణం వద్ద ఏర్పాట్లను బీజేపీ శ్రేణులు ముమ్మరం చేశాయి. ముదోల్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపే లక్ష్యంగా ఈ సభ నిర్వహించినట్లు నియోజకవర్గ అభ్యర్థి రామారావు పటేల్ తెలిపారు. నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు అభిమానులు వచ్చేదిశగ అన్ని గ్రామాలలో వాహనాల ఏర్పాట్లు చేశారు.