18-11-2023 Srinu
ఆంధ్రప్రదేశ్
ఇవాళ నుండి ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయి పోరాటాలు చేసేందుకు సిద్దమయ్యాయి. రెండు పార్టీల కేడర్ కలిసికట్టుగా ముందుకెళ్లేలా ఇప్పటికే ఆత్మీయ సమావేశాలు పూర్తి చేశారు నాయకులు.
విజయవాడలో ఈ నెల 9 వ తేదీన జరిగిన ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశంలో ఉమ్మడి ఆందోళనలపై నిర్ణయం తీసుకున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి జేఏసీ సమావేశంతో పాటు ఒక్కో సమస్యపై ఆందోళనలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇంకోవైపు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఒక జాబితాను సిద్దం చేసారు. రోడ్ల సమస్యలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న కరువు, రైతుల ఇబ్బందులు, కరెంట్ చార్జీల పెంపు, నిత్యావసర ధరల పెంపు, ఇసుక సరఫరా, మద్యం అమ్మకాల్లో అక్రమాలు, యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోవడం వంటి అంశాలపై ఆందోళనలు చేయాలని టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణ కమిటీ నిర్ణయించింది.