18-11-2023 Srinu
ఆంధ్రప్రదేశ్
నేటి నుండి పెరిగిన మద్యం రేట్లు
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి మద్యం ధరలు పెరిగాయి. మద్యం ఎంఆర్‌పీ ఆధారంగా ఏఆర్ఈటీని పెంచుతున్న కారణంగా.. ఈ శనివారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు పెరిగాయి. అంటే క్వార్టర్ సీసాపై సుమారు రూ.10 నుంచి 40 వరకు పెరిగింది. ఇది నిజంగా మందుబాబులను షాక్ కి గురిచేసేం అంశంమే అవుతుంది. ఐఎంఎఫ్ఎల్ కేసు ధర రూ.2500 లోపు ఉన్న వాటిపై 250శాతం. రూ.2500 కంటే ఎక్కువ రేటు కలిగిన వాటి మీద 150 శాతం. బీరు కేసు మీద 225 శాతం ఏఆర్ఈటీ విధించారు. ఏఈడీ, వ్యాట్‌లు మరో పది శాతం, స్పెషల్ మార్జిన్ 110 శాం చొప్పున వసూలు చేయనున్నారు. విదేశీమద్యం కేసుపై 75 శాతం ఏఆర్ఈటీ విధించారు. ఇందుకు సంబంధించి ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీచేశారు.
మందుబాబులు లబోదిబో..
ఇప్పటికే సార్లు మద్యం ధరలు పెంచిన ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం మరో సారి మద్యం ధరలను పెంచింది. ఈ పెంచిన ధరలు శనివారం నుండి అమలులోకి వస్తాయని తెలిపింది. పక్కరాష్ట్రాలతో పోల్చితే మద్యం ధరలు ఏపీలో చాలా ఎక్కువ. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే మద్యాన్ని సంపూర్ణంగా నిషేదిస్తామని ప్రకటించిన జగన్ సర్కారు తరువాత కాలంలో మద్యం కొనసాగించడమే కాకుండా ధరలను అమాంతం పెంచి ఆ వచ్చిన రెవెన్యూతో సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నాం అన్నది ప్రభుత్వం వెర్షన్‌గా మారిపోయింది. కానీ మద్యం వినియోగదారులు మాత్రం ఎప్పటికప్పుడు ధరలు పెంచుకుంటూ పోతే ఎలా అని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.