18-11-2023 Srinu
ఆంధ్రప్రదేశ్
పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
కార్తీక మాసం భక్తులకు ప్రత్యేక మాసం. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు శైవక్షేత్రాలకు వెళ్ళాలని కోరుకుంటారు. శివయ్య దర్శనం చేసుకోవాలని ఆరాటపడతారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ కార్తీక మాసంలో శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు అవనిగడ్డ డిపో మేనేజర్ కె హనుమంతరావు తెలిపారు.
అవనిగడ్డ నుండి పంచారామ యాత్రకు ప్రత్యేక బస్సలకు ఏర్పాటు చేసామని.. ఈ అవకాశాన్ని భక్తులు ఉపయోగించుకోవాలని అన్నారు.ప్రతి శని, ఆదివారాలు పంచారామాలకు ఒకే రోజున దర్శించుకునే విధంగా ఈ నెల 18వ తేదీ శనివారం రాత్రి 12 గంటలకు బస్సు సర్వీసు ఏర్పాటు చేశామన్నారు.
అదే విధంగా ప్రతి శనివారం అహోబిలం, మహానంది, యాగంటి, మంత్రాలయం, ఆలంపూర్, శ్రీశైలం, త్రిపురాంతకం మాత్రకి స్పషల్ సూపర్ లగ్జరీ బస్సులు నడపనున్నట్లు తెలిపారు. కార్తీక పౌర్ణమికి యథావిధిగా అవనిగడ్డ నుండి ఈ నెల 25 శనివారం సాయంత్రం 5 గంటలకు అరుణాచలం, కాణిపాకం, సిరిపురం, అర్ధవీడు, కంచి, తిరుత్తని, శ్రీకాళహస్తి క్షేత్రాలను కలుపుకుని ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు.