18-11-2023 Super
తెలంగాణ
శనివారం రాత్రి సనత్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో కేంద్ర మాజీ మంత్రి శ్రీమతి రేణుక చౌదరి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.
సనత్ నగర్ లోని పలు కాలనీల మీదుగా జెక్ కాలనీ మహాత్మా గాంధీ స్టాట్యూ వద్ద ముగిసింది. తదుపరి భారీగా పాల్గొన్న కార్యకర్తలు జెక్ కాలనీ వాసుల సమక్షంలో వివిధ పార్టీల నుండి కొందరు కాంగ్రెస్లో చేరారు. ఈ సభలో రేణుక చౌదరి మాట్లాడుతూ సనత్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థికి ఎవరూ లేరు అనుకుంటున్నారేమో.. కానీ నేనున్నాను కోట నీలిమ ఒంటరి కాదు గుర్తుపెట్టుకోండి అని హెచ్చరించారు.
జెక్ కాలనీ వాసుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు డాక్టర్ నీలిమ. ఈ సభలో డాక్టర్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, కౌంట్డౌన్ మొదలైంది, బిఆర్ఎస్ నాయకులు గుర్తుపెట్టుకోండి అని చెప్పారు.