19-11-2023 Super
తెలంగాణ
అందోల్: అందోల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబుమోహన్, కుమారుడు ఉదయ్ బాబు సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఉదయ్ బాబు తో పాటు జోగిపేట మున్సిపల్ అధ్యక్షుడు సాయికృష్ణ, అందోల్ మండల అధ్యక్షుడు నవీన్ ముదిరాజ్, చౌటకూర్ మండల అధ్యక్షుడు శేఖర్, ఇతర బీజేపీ నాయకులు పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.