19-11-2023 Srinu
తెలంగాణ
హైదరాబాద్: ఎస్సార్ నగర్ బీసీ వెలమ సంక్షేమ సంఘం (కొప్పుల & పోలినాటి) ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్ సంజీవయ్య పార్క్ లో జరిగిన కార్తీక వన సమారాధన ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా.. ఉసిరి చెట్టుకి పూజలు చేసి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి నగరంలోని వివిధ కాలనీ నుండి వెలమ సోదరులు తమ ఫ్యామిలీతో పాటు సన్నిహిత మిత్రులను కూడా తీసుకురావడం జరిగింది. వెలమ సంక్షేమ సంఘం నూతన (2024) క్యాలెండరు ఆవిష్కరించారు. పిల్లలకు వివిధ రకాలుగా కాంపిటీషన్స్ మరియు సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సూర్య అధినేత నూకారపు సూర్య ప్రకాష్ రావు, విశిష్ట అతిథిగా ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, అధ్యక్షులు గొల్లు బాబురావు, చింతల వెంకట అప్పారావు, వర్రీ ప్రభాకర్ రావు, వెలమ సంక్షేమ సంఘం విజయవాడ అధ్యక్షుడు, ఉపాధ్యాయ సంఘ నాయకుడు మూకల అప్పారావు, నవుడు వెంకట రమణ (రమణ బాబు), మరియు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు తదితరులు పాల్గున్నారు.