20-11-2023 Srinu
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం: అర్థరాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం. సాధారణంగా హార్బర్‌లో మత్స్యకారులు తమ బోట్లన్నింటినీ లంగరు వేసి ఉంచుతారు. మూడు రోజుల క్రితం సముద్రంపైకి వేటకు వెళ్లిన బోట్లు కూడా ఆదివారం సాయంత్రానికి తీరానికి చేరాయి..అర్ధరాత్రి తర్వాత ఓ పడవలో నుంచి మంటలు చెలరేగాయి. అలా మెల్లిగా మంటలు మిగిలిన చోట్లకు అంటుకుని 60కుపైగా బోట్లకు అగ్నికి ఆహుతయ్యాయి.
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు, అగ్నిమాపక కేంద్రాలకు కూడా సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కొన్ని గంటల పాటు మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.