20-11-2023 RJ
ఆంధ్రప్రదేశ్
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో..టీడీపీ అదినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం..తాజాగా చంద్రబాబు తరపు లాయర్ల వాదనలతో ఏకీభవించి తుది తీర్పును వెలువరించింది. ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్డు తీర్పు ఇచ్చింది. అనారోగ్య కారణాలతో ఈ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై ఉన్న ఆయనకు పూర్తి బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జున్ రావు తీర్పు వెలువరించారు.
కాగా, మధ్యంతర బెయిల్ పై ఉన్న షరతులు ఈ నెల 28 వరకే వర్తించనున్నాయి. ఈ నెల 29 నుంచి రాజకీయ సభలు, ర్యాలీలు, ప్రెస్ మీట్లలో ఆయన పాల్గొనవచ్చని హైకోర్టు తెలిపింది. ఆగస్ట్ 9న స్కిల్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. అక్టోబర్ 31న అనారోగ్య సమస్యలతో 4 వారాల మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొంది.