20-11-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్: ఉదయం 7 టెంపుల్స్ లో సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ సందర్శించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
బేగంపేట్ లో పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నీలిమకి ప్రజలు, పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా కోట నీలిమ మాట్లాడుతు.. బిఆర్ఎస్ రాజ్యంలో మొత్తం రౌడీయిజం నడుస్తుందని అన్నారు. తను సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంటే, తాను లోకాల్ కాదని పుకార్లు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ ఆరోపణలు అన్ని అవస్తవాలని కోట నీలిమ పేర్కొన్నారు. గత 50 ఏళ్ల గా కాంగ్రెస్ పార్టీ తోనే ఉన్న మా కుంటుంబాన్ని నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ గుండాలకి కోట నిలిమ సవాల్ విసిరారు. ఎన్నికల్లో గెలవాలంటే అభివృద్ధి చేయాలి కానీ ఇలాంటి అసత్య ఆరోపణలు కాదని అన్నారు.
ఇలాంటి రూమర్స్ అన్నిటికి అడ్డుకట్ట వేయాలంటే తెలంగాణలో కాంగ్రెస్ రావాలని ఆమె పేర్కొన్నారు. .30వ తేదిన జనగనున్న ఎన్నకల్లో తప్పకుండా విజయం సాధిస్తామని. .. తనకు ఒక్క అవకాశం ఇస్తే అవినీతి రహిత పాలన అందిస్తూ.. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూసుకుంటానని హామీ ఇచ్చారు. గత తొమ్మిది సంవత్సరాల అహంకారపూరిత పాలనకు ముగింపు పలకాల్సిన అవసరం వచ్చిందని పిలుపునిచ్చారు .