21-11-2023 RJ
తెలంగాణ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు మరింత హీట్ పెంచాయి.
మంగళవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్, మంచిర్యాలలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివేక్ నివాసాలతోపాటు సోదరుడు వినోద్, కుమారుడు, కూతురు, బంధువులు, అనుచరుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం నాలుగు బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నాలుగు రోజులక్రితం 50లక్షల నగదుతో పట్టుబడ్డారు వివేక్ కంపెనీ ఉద్యోగులు. ఇక, ఇప్పుడు ఏకంగా ఐటీ దాడులు జరగడం కలకలం రేపుతోంది. వివేక్ నివాసాల్లో ఐటీ దాడులు చేయడంపై ఆయన అనుచరులు ఆందోళన చేస్తున్నారు. మంచిర్యాలలోని వివేక్ ఇంటికి పెద్దఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు.
కావాలనే టార్గెట్‌చేసి ఐటీ తనిఖీలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో వివేక్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తల ఆందోళన నేపథ్యంలో పోలీసు బలగాలను భారీగా మోహరించారు.