21-11-2023 RJ
తెలంగాణ
జనగామ, నవంబర్ 21: సూర్యాపేట రోడ్ లో బ్యాంకెట్ హాల్ పర్మిషన్ కోసం రూ. 40వేలు లంచం తీసుకుంటూ... జనగామ మున్సిపల్ కమిషనర్ రజిత ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ దొరికారు.
మున్సిపాలిటీ కార్యాలయంలోని తన చాంబర్లో లంచం తీసుకుంటుండగా.. కమిషనర్ రజితను అధికారులు పట్టుకున్నామని ఏసీబీ డిఎస్పి సాంబయ్య తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.