21-11-2023 Srinu
తెలంగాణ
హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30వ తేదిన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ప్రధానంగా టి.ఆర్.ఎస్., ఐ.ఎన్.సి., బి.జె.పి., ఎం.ఐ.ఎం పార్టీలు బరిలో ఉన్నాయి.
వీటికి తోడు చిన్నా, చితక పార్టీలు, స్వతంత్రులు కూడ బరిలో ఉన్నారు. ఓటర్లను చైతన్యపరుచుట. ఎన్నికలలో పోటీచేయు అభ్యర్థుల నేరచరిత్రను (వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా) గ్రహించి ఒక ప్రత్యేక కమిటీ ద్వారా విశ్లేషించి పార్టీల వారీగా బరిలో నిలచినవారిలో ఎందరు నేరచరిత్ర కలిగి ఉన్నారో తెలుపుతూ ఒక నివేదిక ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తయారుచేసింది.
మా విశ్లేషణలో కొన్ని కేసులు ఉద్యమం సందర్భంగా నమోదు చేయబడినవి ఉన్నాయి. వాటికి తోడు క్రిమినల్ కేసులు కూడ ఉన్నాయి. అదీకాక చాలా కేసులు సంవత్సరాల నుండి పెండింగులో ఉన్నాయి. కొన్ని కేసులు అతిమామూలు కేసులు, వాటిని పరిగణలోనికి తీసుకోవలసిన అవసరం లేదు.
కాని తమ అఫిడవిట్లో చూపించడంతో మేము లెక్కలోనికి తీసుకున్నాము. మొత్తము 119 స్థానాలకు గాను పైన ఉదహరించిన పార్టీల నుంచి 360 మంది ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీలో ఉండగా వారిలో 226 మందికి నేరచరిత్ర ఉంది. ఈ 226 మందిలో చాలామంది గెలిస్తే వచ్చే శాసనసభలో మొత్తము నేరచరిత్రులే ఉంటారు.
రాజకీయపార్టీలు గెలుపు గుర్రాల వేటలో నేరచరిత్రులకు అధికంగా టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇది మన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. నేరచరితులు ఎన్నికలలో పాల్గొనకుండా నిరోధించాలని సుప్రీమ్ కోర్టులో పిల్ వేయగా ఈ విషయంలో తాము చట్టం చేయలేమని అది పార్లమెంట్ మరియు ఎన్నికల సంఘం పరిధిలోనికి వస్తుందని తెలుపుతూ, కొన్ని సూచనలు చేసినారు.
రాజకీయపార్టీలు నేరచరిత్రులకు టికెట్లు ఇవ్వవద్దని, ఒకవేళ ఇచ్చినా అందుకు తగిన కారణాలు తెలపాలని, అలాగే నేరచరిత్రుల వివరాలు పత్రికల ద్వారా ప్రజలకు తెలపాలని, పార్టీల వారీగా అభ్యర్థులపై నమోదు చేయబడిన కేసులు అలాగే మహిళలకు ఇచ్చిన టికెట్ల సంఖ్యల పట్టిక ఇందువెంట జతచేయబడినది.
ప్రజలు విజ్ఞతతో మంచివారిని ఎన్నుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఫోరం ఫర్ గుడ్గ వర్నెన్స్ కోరుతుంది. ఈ విషయాలను సంస్థ అధ్యక్షులు ఎం పద్మనాభరెడ్డి, సెక్రటరీ సోమా శ్రీనివాస రెడ్డి, తెలియజేసారు.