21-11-2023 Srinu
తెలంగాణ
హైదరాబాద్, నవంబర్ 21: శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ మెంబర్ డాక్టర్ వేణుగోపాల్ రాజు, ఎమ్మెల్యే గాంధీకి మద్దతుగా తన నామినేషన్ను ఉపసంహరణ చేసుకొని, బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.
మంగళవారం నాడు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా డాక్టర్ వేణుగోపాల్ రాజు తెలియజేశారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నియోజకవర్గంలో ఎన్నో మంచి పథకాలను తీసుకువచ్చి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారని ఆయనకు అండగా ఉండాలనే ఉద్దేశంతో నేను బిఆర్ఎస్ లో చేరానని చెప్పారు.