22-11-2023 Srinu
తెలంగాణ
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మద్దతుగా బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై బీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ తన అవినీతితో రాజకీయాలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. శ్రీలంకలోనూ కుటుంబ పాలన కారణంగా దేశం నాశనమైందని అన్నామలై అన్నారు. కేసీఆర్ అవినీతితో రాజకీయాలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. విభజన తర్వాత కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ అమలు చేయలేదన్నారు.
తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కేసీఆర్ ఆరున్నర లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు అన్నామలై. ఎనిమిది కోట్ల జనాభా కలిగిన తమిళనాడు రూ.7 లక్షల కోట్ల అప్పు ఉంటే.. 4 కోట్ల జనాభా కలిగిన తెలంగాణ రూ.6.5 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయిందని ఆయన ధ్వజమెత్తారు. దేశమంతా ఇప్పుడు నరేంద్ర మోదీ మోడల్ కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన తెలంగాణలోని శేరిలింగంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అన్నామలై మాట్లాడుతూ..శేరిలింగంపల్లి నియోజకవర్గం మినీఇండియాగా ఉందని, ఇక్కడ అన్ని వర్గాలకు న్యాయం చేస్తాడనే ఉదేశ్యంతో పార్టీ అధిష్ఠానం రవికుమార్ యాదవ్‌కు టిక్కెట్ ఇచ్చిందన్నారు. ఆయనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్ధించారు.