23-11-2023 RJ
తెలంగాణ
సికింద్రాబాద్: మొండ మార్కెట్ లోని రాజీవ్ గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ పార్టీ ప్రచార హోల్డింగులను నిలిపి అవమానం చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు.
హోల్డింగ్ పెటిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజీవ్ గాంధీ విగ్రహం ముందు ఆందోళన చేశారు.
రాజీవ్ గాంధీ విగ్రహాల వద్ద బీఆర్ఎస్ నాయకుల హోల్డింగ్ పెట్టిన వారిపై తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసే వరకు తమ సత్యాగ్రహ ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు.