23-11-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, నవంబర్ 23: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మధు గౌడ్ ఆధ్వర్యంలో ఏ కే గౌడ్ ఫంక్షన్ హాల్ సనత్ నగర్ డివిజన్లో నిర్వహించిన బిసి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి డాక్టర్ కోట నీలిమ హాజరయ్యారు.
బీసీ అభివృద్ధి సంక్షేమంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తుందని సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ.. బీసీలలోని అనేక కులాలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
బీసీ అభివృద్ధి కి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రత్యేక కేటాయింపులు చేశారని ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ బిల్లులు బీసీలకు ప్రత్యేక కోట ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని విభాగాల్లో బీసీలకు ప్రత్యేక స్థానం, గుర్తింపు ఉంటుందని ప్రకటించారు.
సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ.. డాక్టర్ నీలిమక్క కు బీసీలలోని అన్ని సంఘాలు, వర్గాలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.