23-11-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, నవంబర్ 23: గురువారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ లో గల కాచిబౌలి, గైదన్ బాగ్, నల్లగుట్ట టుబాకో బజార్, కటిక బస్తీ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వర్షం కురుస్తున్నా తన ప్రచారాన్ని కొనసాగించారు. అడుగడుగునా ప్రజలు మంత్రికి బ్రహ్మరధం పట్టారు. మళ్ళీ అధికారంలోకి మేమె వస్తాం... అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యధావిధిగా కొనసాగిస్తామని సనత్ నగర్ MLA అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఇండ్లపై నుండి పూల వర్షం కురిపిస్తూ... మహిళలు మంగళ హారతులు పట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో దేశంలోని ఎక్కడా లేని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ క్రింద ఒక లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయం, అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
200 రూపాయలు ఉన్న వృద్దులు, వితంతువులక పెన్షన్ ను 2016 రూపాయలకు పెంచి వారి ఆత్మగౌరవాన్ని పెంచిందని తెలిపారు. అదేవిధంగా సొంత ఇల్లు లేని పేదల సొంత ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
GHMC పరిధిలో ఇప్పటి వరకు 70 వేల మందికి ఇండ్లను పంపిణీ చేశామని, మరో ౩౦ వేల ఇండ్ల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నామని, సంక్షేమ పథకాలు అందని వారు బాధపడవద్దని, అందరికి అందజేస్తామని ప్రకటించారు.
మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 400 రూపాయలకు వంట గ్యాస్, 15 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా రేషన్ ద్వారా సన్న బియ్యం కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు.
మంత్రి వెంట సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్ బిఆర్ఎస్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్, కిరణ్మయి, డివిజన్ బిఆర్ఎస్ అద్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, కిషోర్, సత్యనారాయణ, రాజేష్, కోటేశ్వర్ గౌడ్, అరుణ్ భట్, దుబాయ్ శ్రీను, షఫీ సతీష్ తదితరులు ఉన్నారు.