24-11-2023 Srinu
ఆంధ్రప్రదేశ్
ఏపీ సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయం విడుదల చేసింది. సీఎం జగన్, సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ పాలనను సాగిస్తున్నారు. తన సంక్షేమ క్యాలెండర్‌లో ఎక్కడా వెనుకడుగు వేయకుండా దూసుకుపోతున్నారు.
నిధుల కొరత ఎదురైనప్పటికీ చెప్పిన సమయానికి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నారు. ఇందులో భాగంగానే నవంబర్ 29న విద్యా దీవెన నిధులను విడుదల చేసేందుకు సర్వం సిద్దమైంది.
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్ మండలం నన్నూరు గ్రామంతో పాటూ కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామాల్లో సీఎం జగన్ పర్యటించనున్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. ఇప్పటికే జగన్ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ విడత నిధులను విడుదల చేసి డిశంబర్, జనవరి నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాగిస్తూ నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది.