ad1
ad1
Card image cap
Tags   Sanath Nagar Elections 2023 Hyderabad

  25-11-2023       Srinu

దళిత బహుజన గిరిజన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం..!

తెలంగాణ

బన్సీలాల్ పేట డివిజన్ సిసినగర్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి ప్రసంగంలోని కొన్ని ముఖ్యంశాలు

  • బిజెపి, బిఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు కలిసి సనత్ నగర్ లో ఒక మహిళ మీద పోరాటం చేస్తున్నాయి. పనిచేసే మహిళ అయినా డాక్టర్ కోటా నిలిమ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. 
     
  • ఈఎస్ఐ హాస్పిటల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని కట్టించారు.
     
  • రెండు కోట్ల ఉద్యోగాలు అందిస్తాం అన్న మోడీ ఎన్ని ఉద్యోగాలు ప్రకటించారని ప్రశ్నించారు.  
     
  • కాంగ్రెస్ హయాంలో  గ్యాస్ ధరలు రూ.450 రూపాయలు ఉండేది కానీ నేడు రూ.1150 కు పెరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే దానిని రూపాలు 400 తగ్గిస్తాం. 
     
  • నేడు రాష్ట్రంలో దేశంలో అన్ని వస్తువుల ధరలు పెరిగాయి అన్ని వస్తువుల ధరలను పెంచిన కేసీఆర్ మోడీలను తొలగించాలని పిలుపునిచ్చారు. 
     
  • కర్ణాటకలో ఇచ్చిన అమ్మి అన్ని హామీలను అమలు చేశాం. 
     
  • మోడీ కేసీఆర్ ఇద్దరు ఒకటే తోడుదొంగలు..
     
  •  ఒక కొట్టినట్టు చేస్తే మరొకరు ఏడ్చినట్టు నటిస్తున్నారు.
     
  • ఢిల్లీ లిక్కర్ కేసులో చాలామందిని అరెస్ట్ చేసిన ఈడి తెలంగాణ కు చెందిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదో ప్రజలు గమనించాలి.
     
  • ప్రధాని మోడీ ఆదానిలాంటి బడా వ్యాపారులకే మేలు చేస్తున్నాడు తప్ప నిరుద్యోగులను పేదవారిని పట్టించుకోవడం లేదు.
     
  • హైదరాబాద్ కు వచ్చిన ప్రతిసారి కెసిఆర్ అవినీతిపరుడని అంటున్న మోడీ, అమిత్ షా మరి ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి.
     
  • బిజెపి వాళ్లవి అన్ని కక్ష సాధింపు రాజకీయాలే..
     
  •  రాజస్థాన్ లో ఎన్నికలు జరుగుతున్న వేళ.. సీఎం కుటుంబ సభ్యుల పై  ఈడి కేసు పెట్టారు.
     
  • బిజెపి బీఆర్ఎస్ ఎంఐఎం ఈ మూడింటి ప్రేమ బంధం పెనవేసుకొని ఉంది ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
     
  • పీఎం కాగానే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని ఇండియాకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఖాతాల్లో 15 లక్షలు వేస్తానన్న మోడీ ఇంతవరకు ఆ పని చేయలేదు.
     
  • కాంగ్రెస్ హామీలన్నీ BRS కాపీ కొడుతున్నాయి.
     
  • అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను  తప్పకుండా అమలు చేస్తుంది.
     
  • పేదల బతుకులు మారాలంటే వారి పిల్లలకు చక్కటి విద్య అవసరం ..అందుకోసం కాంగ్రెస్ నిబద్ధత తో పని చేయనుంది.
     
  • ప్రతి మండలానికి ఒక ఇంగ్లీష్ పాఠశాలను ఏర్పాటు చేస్తాం.
     
  • మొదటి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము.
     
  • ఫామ్ హౌస్ సీఎం ను మీ ఓటుతో ఇంటికి సాగనంపండి..

డాక్టర్ కోటా నీలిమ మాట్లాడుతూ..తన గెలుపు ఖాయమని ప్రకటించారు. దళిత బహుజన గిరిజన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే దళితుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామని తెలిపారు.  

అహంకారంతో కూడిన అవినీతి పాలనకు అంతం పలకాలని పిలుపునిచ్చారు. ఈనెల 30వ తేదీన జరిగే ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గంలో బ్యాలెట్ పై మొదటి నెంబర్ లోని డా.కోట నీలిమ గారి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP