25-11-2023 RJ
తెలంగాణ
జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహమ్మద్ అజహరుద్దీన్ కు మద్దతుగా యువ నాయకుడు వి.నవీన్ యాదవ్ నియోజకవర్గ పరిధిలో నిరవధికంగా పాదయాత్ర చేయడం తెలిసిందే..
ఈ ప్రచారంలో యువత, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. యూసఫ్ గూడా, కృష్ణా నగర్, వెంకటగిరి ప్రాంతాలలో డోర్-టు -డోర్ పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకుని, వారిని రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మహమ్మద్ అజహరుద్దీన్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. నవీన్ యాదవ్ తో పాటుగా స్థానిక ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు.