26-11-2023 RJ
తెలంగాణ
సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి కోట నీలిమ శనివారం రాత్రి అమీర్పేటలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది.
ఈ ర్యాలీ ధరమ్ కరమ్ రోడ్, బల్కంపేట రోడ్, అమీర్పేట మెయిన్ రోడ్ మీదుగా సత్యం థియేటర్ వరకు వచ్చాక, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ మాట్లడుతూ..తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేయడం ఆయన హోదాకు తగదని చెప్పారు.
కావాలంటే ఇక్కడ ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కర్ణాటక వచ్చి చూసినట్లయితే నిజాలు తెలుస్తాయని డీకే శివకుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభిమానులు క్రేన్ సహాయంతో భారీ గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటుగా సనత్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి కోట నీలిమ, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రవీందర్ గౌడ్, సనత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రాపోలు విజయకుమార్ ఎలీషా, PRO వెంకట్, అడ్మిన్స్ ఇషాన్ త్యాగి, రాహుల్, అంశుమాన్ సెయిల్, తదితరులు పాల్గొన్నారు.