27-11-2023 RJ
తెలంగాణ
ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే నాయకుడిని కాదని, నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నానని సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఆదివారం పద్మారావు నగర్ లోని పద్మనాభ రెసిడెన్సీ, సవరాల బస్తీ, బాపూజీనగర్ లలో ఏర్పాటు చేసిన సమావేశాలలో పాల్గొన్నారు. పెరుగుతున్న జనాభా, నూతన భవనాల నిర్మాణంతో మౌలిక వసతుల అవసరం ఏర్పడుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రోడ్లను ఎంతో అభివృద్ధి చేశామని, నిత్యం రోడ్లపై మురుగునీరు ప్రవహించే సమస్యను పరిష్కరించామని తెలిపారు.
తన కంటే ముందు ఈ ప్రాంతం నుండి ఎన్నికై ముఖ్యమంత్రి గా ఉండి కూడా చేయలేని అభివృద్ధి ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదిన్నర సంవత్సరాల లో చేసినట్లు చెప్పారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నామని అన్నారు.
సనత్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి లో మోడల్ గా నిలపాలనేది తన లక్ష్యం అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగేందుకు బీఆర్ఎస్ పార్టీని బలపర్చాలని కోరారు. తనను మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 400 రూపాయలకే గ్యాస్ సిలెండర్, రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ, 15 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించబడుతుందని చెప్పారు. తమకు అన్ని విధాలుగా అండగా నిలబడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రకటించారు.
ఈ సమావేశంలో కృష్ణారావు, అనంత్, శ్రీధర్, సంజయ్, స్వప్న, పద్మారావు నగర్ బీఆర్ఎస్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పద్మారావు నగర్ పార్క్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. వాఁకర్స్ ను కలిసి ఓటును అభ్యర్ధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్క్ లను ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు.
ఎంతో అద్వాన్నంగా ఉన్న పద్మారావు నగర్ పార్క్ లో పాత్ వే ల నిర్మాణం, ఓపెన్ జిమ్ ఏర్పాటు, వాఁకర్స్ కోరిక మేరకు షెడ్డు నిర్మాణం చేసినట్లు వివరించారు. ఇవే కాకుండా రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ లీకేజీ లు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు.
తనను మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాఁకర్స్ క్లబ్ అధ్యక్షుడు రణధీర్, శ్రీధర్, అడ్వైజర్ చంద్రశేఖర్, చక్రధర్, బాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారు.