27-11-2023 RJ
తెలంగాణ
శేర్లింగంపల్లి నియోజకవర్గ బిజెపి అభ్యర్థి రవికుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఏ కాలనీకి వెళ్లినా ఆయనకు బ్రహ్మరధం పడుతున్నారు. ముఖ్యంగా యువత, మహిళలు భారీగా వస్తున్నారు.
జనసేన నాయకులు కార్యకర్తలు కూడా రవికుమార్ పర్యటనలో పాల్గొంటున్నారు. రవికుమార్ యాదవ్ తో పాటు పార్లమెంట్ మాజీ సభ్యులు రాష్ట్ర బిజెపి నాయకులు కొండా విశ్వేశ్వర రెడ్డి ఆదివారం కొండాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి డివిజన్లో సుడిగాలి పర్యటనలు, ర్యాలీతో కార్యకర్తలకు ఉత్సాహం నింపారు.
బంగారు తెలంగాణను కేసీఆర్ అప్పుల తెలంగాణ గా మార్చారని దుయ్యబట్టారు. శేర్లింగంపల్లి నియోజకవర్గ బిజెపి అభ్యర్థి రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.."ధర్మాన్ని స్తాపిద్దాం - అధర్మాన్ని అంతమొందిద్దాం" అని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. శేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు, భారత ప్రధాని నరేంద్ర మోడీ పనితీరు చూసి బిజెపిని గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నారని చెప్పడం జరిగింది.
రాత్రి జరిగిన ర్యాలీలో సీనియర్ బిజెపి నాయకులు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ఈటెల మాట్లాడుతూ కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు. కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచేస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో కలపడం ఖాయమని, వచ్చేది బిజెపి ప్రభుత్వం అని శేర్లింగంపల్లి ప్రజలు రవికుమార్ ని భారీ మెజారిటీతో గెలిపిస్తారని ధీమాగా చెప్పడం జరిగింది.