27-11-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్: సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్ల శిక్షణ శిబిరం సోమవారం ఘనంగా నిర్వహించారు. బేగంపేట్ లోని పైగా ప్యాలెస్ లో నిర్వహించిన ఈ నియోజకవర్గంలోని అన్ని ఎన్నికల బూత్ ఏజెంట్లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన సనత్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోట నిలిమ గారు మాట్లాడుతూ... బూత్ ఏజెంట్లకు భారీ డిమాండ్ ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశారు. బూత్ ఏజెంట్లను ఎంపిక చేయడం చాలా క్లిష్టంగా మారిందని అన్నారు.
యువకులు అనుభవంతులతో బూత్ కమిటీలు చాలా పటిష్టంగా ఉందని తెలిపారు. ఎలాంటి అవాంతర పరిస్థితిని ఎదుర్కోవాలని సూచించారు. దొంగ ఓట్లు అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్లు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. ఎన్నికలకు బూత్ ఏజెంట్లు కీలకంగా ఉన్నారని తెలిపారు.