27-11-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్: సోమవారం రాత్రి సనత్ నగర్ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ అభ్యర్థిని శ్రీమతి కోట నీలిమ నిర్వహించిన భారీ బహిరంగ సభ సక్సెస్ అయింది. సభా ప్రాంగణం ఎటు చూసినా జనంతో క్రిక్కిరిసిపోయింది, ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఉత్తరప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు మెంబర్ ఇమ్రాన్ ప్రతాప్ ఘడి మాట్లాడుతూ..తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి బై బై చెప్పే రోజు ఈ నెల 30వ తారీకు. నేను ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాను అంటే నేను కొన్ని జిల్లాలు ప్రచారంకి వెళ్లడం జరిగింది. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్కు రాబోతున్నాయి.
కెసిఆర్ కి సెలవు ఇచ్చి ఫామ్ హౌస్ కి పంపే ఏర్పాట్లు, తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. సనత్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిని టైగర్ కోటా నీలిమ భారీ మెజారిటీతో అసెంబ్లీలో అడుగుపెట్టడం జరుగుతుందని చెప్పారు. ఇమ్రాన్ ప్రతాప్ మాట్లాడుతున్నప్పుడు కార్యకర్తల చప్పట్లతో సభ మారుమోగిపోయింది.
ఈ సభలో కాంగ్రెస్ అభ్యర్థిని శ్రీమతి కోట నీలమ మాట్లాడుతూ..నేను పోటీ చేస్తున్నట్టు తెలుసుకొని నాకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి, ఎలా పోటీలో ఉంటావో చూస్తాం అని భయపెట్టారు.
నన్ను భయపెడితే నేను భయపడతానా? నేను భయపడాలా? అని కార్యకర్తలను అడిగిమరీ చెప్పడం జరిగింది. ఢిల్లీలో సోనియమ్మ, రాహుల్ గాంధీ, హైదరాబాదులో రేవంత్ అన్న నాకు కొండంత ధైర్యం. నేను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు కాంగ్రెస్ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది.