28-11-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్: సనత్ నగర్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి నియోజకవర్గం పాదయాత్రలతో బిజీగా ఉన్నారు. బిజెపి కేంద్ర పెద్దలు కూడా శశిధర్ రెడ్డి పాదయాత్రలో పాలుపంచుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీకి ప్రజలు, కార్యకర్తలు భారీగా రావడం జరిగింది, యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. తెలంగాణలో డబల్ ఇంజిన్ సర్కార్ రాబోతుంది. బిఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్లు బిషాణం సర్దుకోవాలని చెప్పారు.
యోగి ఆదిత్యనాథ్ ని చూడటానికి ప్రజలు ఉత్సాహం కనబరిచారు, సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు పిలుపునిచ్చారు.