28-11-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, నవంబర్ 27: సోమవారం ఉదయం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో, శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవికుమార్ యాదవ్, మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డిలు పాల్గొన్నారు.
రాయదుర్గం నుండి ప్రారంభమై ముధురానగర్, ఖాజాగూడ, నానాక్రంగుడ, విప్రోసర్కిల్, గౌలిదొడ్డి, గోపన్పల్లి మీదుగా నల్లగండ్ల హుడా కాలనీ గుల్మెహర్ పార్కో వరకు బైక్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.