28-11-2023 RJ
తెలంగాణ
సనత్ నగర్: ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో గడువు ముగిస్తుండడంతో మంగళవారం అన్ని ప్రధాన పార్టీలు ర్యాలీలకు సిద్ధమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
పద్మారావునగర్ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ ఐడీహెచ్గాలనీ, జబ్బార్ కాంప్లెక్స్, మోండా, గాంధీ ఆస్పత్రి, షోలాపూర్ స్వీట్స్, మహంకాళి దేవాలయం, కళాసీగూడ, రాణిగంజ్, బేగంపేట, పాటిగడ్డ, ఎన్డీటీనగర్, ఓల్డ్ కస్టమ్స్బస్తీ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, బల్కంపేటల మీదుగా సనత్ నగర్ వరకు ర్యాలీ జరుగుతుందన్నారు.
బీజేపీ అభ్యర్ధి మర్రి శశిధర్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా బైక్ ర్యాలీ జరపనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ర్యాలీ
నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జేక్ కాలనీ నుంచి ప్రారంభమై సనత్ నగర్ బస్టాప్, ఎస్ఆర్డీ, స్వామి టాకీస్, 60 ఫీట్ రోడ్డు, ఎల్లమ్మ టెంపుల్, డీకేరోడ్డు, ఆమీర్పేట గ్రీన్ పార్కు రోడ్డు, బ్రాహ్మణవాడీ, ఓల్డస్టమ్బస్తీ, మోతిలాల్ నెహ్రు నగర్, ప్రకాష్ నగర్ వాటర్వర్క్స్, పాటిగడ్డ, మినిస్టర్ రోడ్డు, పీజీ రోడ్డు, ప్యారడైజ్, స్వప్నలోక్ కాంప్లెక్స్, ప్యాట్నీ సెంటర్, అంజలి టాకీస్, సిటీలైట్ హోటల్, బైబిల్ హౌస్, బన్సీలాల్పేట, గొల్లకొమురయ్య బస్తీ, ఫ్లోరా హోటల్, పద్మారావునగర్ వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ మొదట బల్కంపేట డోర్-టు-డోర్ ప్రచారం, రాంగోపాల్పేట్ లో పబ్లిక్ మీటింగ్, మహాకాళి టెంపుల్ నుండి మోండా మార్కెట్ వరుకు బైక్ ర్యాలీ జరపనున్నారు.