28-11-2023 RJ
తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గం భారీ బహిరంగ సభను మంగళవారం రాంగోపాల్పేట్, సింధీ కాలనీలో నిర్వహించారు. న్యాయమైన పాలన ప్రజలకు అన్ని ప్రభుత్వ పథకాలు చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. కెసిఆర్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కెసిఆర్, ప్రధాని మోదీ ఒకటేనని కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు. అన్ని పార్టీలు కలిసి కలిసి కాంగ్రెస్ ను ఓడించాలని చూస్తున్నాయని అన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా కేసీఆర్ పనితీరుతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రకటించారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ హవా నడుస్తుందని తెలిపారు. ప్రజల కలల భవిష్యత్తు నిర్మాణం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో సాధ్యమవుతుందని ప్రకటించారు. హైదరాబాద్ కూతురు... రాజస్థానీ కోడలు అయిన డా. కోట నీలిమ కు ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించాలని పిలుపునిచ్చారు. రాజస్థాన్ కోడలైన నీలిమకు తమ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
తెలంగాణ కల సహకారం చేసిన సోనియా గాంధీకి ప్రభుత్వం ఏర్పాటు చేసి కానుక ఇవ్వాలని పిలుపునిచ్చారు. డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ.. న్యాయం కోసం ఓటు వేయాలని ఆర్థిక సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని తెలిపారు. తనకొక్క అవకాశం ఇచ్చి సనత్ నగర్ భవిష్యత్తు మార్చే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.