29-11-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్: సనత్ నగర్ బిజెపి అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి మంగళవారం ప్రచారానికి చివరి రోజు కాబట్టి ఉదయం 11 గంటలకు సనత్ నగర్ డివిజన్లో జెక్ కాలనీ లోని స్థానిక ప్రజలతో మాట్లాడి తన ప్రచారం మొదలుపెట్టారు. కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకి ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, కానీ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి చేయడం లేదని ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెబుతుంది అని విమర్శించారు.
రాష్ట్రంలో వచ్చేది మన ప్రభుత్వమే, మీకు నేనున్నాను మా తండ్రి అయిన దివంగత ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారికి సనత్ నగర్ నియోజకవర్గం అంటే ఎంతో ఇష్టం. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ హబ్ గా చేసి ఎంతోమంది కార్మికులకు ఉపాధి కల్పించారు. వివిధ రాష్ట్రాల నుండి సనత్ నగర్ వచ్చి ఇక్కడే స్థిరపడిన అందరూ తెలంగాణ ప్రభుత్వ బిడ్డలే, వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది.
ఇంకా కొన్ని పనులు చేయవలసి ఉంది, మన ప్రభుత్వం వచ్చాక తప్పనిసరిగా పూర్తి చేస్తాను. కేంద్రంలో ఎట్లైనా నరేంద్ర మోదీ ప్రధాని కావడం తథ్యం, నన్ను సనత్ నగర్ ఎమ్మెల్యేగా గెలిపించినట్లైతే ప్రధాని మోదీతో కొట్లాడి నియోజవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను.
ఈ మధ్యన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు, తెలంగాణ బిజెపి అధ్యక్షులు, కేంద్రమంత్రి అయిన కిషన్ రెడ్డి ప్రచారంలో పాల్గొనడం తెలిసిందే. రోడ్ షోలో భారీగా ప్రజలు, బిజెపి అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అమీర్పేట లో ఉన్న గురుద్వార్ ను సందర్శించే సందర్భంలో, ఆయనతోనే మర్రి శశిధర్ రెడ్డి కలిసి పాల్గున్నారు.