01-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
- నాగార్జున సాగర్ డ్యామ్ వివాదంపై ఏపీ ప్రభుత్వాన్ని చర్చలకు పిలిచిన తెలంగాణ ప్రభుత్వం
నీటి వివాదాలు కొసాగుతున్న క్రమంలో ఏపీ పోలీసుల డ్యామ్ వద్ద వ్యవహరించిన తీరుపై తెలంగాణ ప్రభుత్వం మండిపడుతోంది. ఈ వివాదంపై ఏపీ ఇరిగేషన్ శాఖా మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఏపీ ప్రభుత్వం చర్య న్యాయమైనదేనని.. తమ ప్రభుత్వం ఏమాత్రం తప్పులేదని అంటూ చెప్పుకొచ్చారు. ఏపీ పోలీసుల చేసింది దండయాత్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.
ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని సరిచేసందుకు, మా హక్కులను కాపాడేందుకు యత్నించామని దాన్ని దండయాత్ర అంటూ తప్పుడు ప్రచారం చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మా నీటిని మా రైతుల పంటల కోసం విడుదల చేస్తే తప్పేంటీ ? అని ప్రశ్నించారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా ?
ఏపీకి రావాల్సిన నీటిని తప్ప ఒక్క నీటి బొట్టును కూడా తాము తీసుకోమని ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు, తెలంగాణ అధికారులకు చెబుతున్నానని అర్థం చేసుకోవాలని కోరారు. ఇదే విషయాన్ని ఏపీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలన్నారు. మా నీటిని మేం విడుదల చేసుకునే స్వేచ్ఛ తమకు కావాలన్నారు..!