02-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
తెలుగుదేశం అధినేత చంద్రబాబు, అయన సతీమని భువనేశ్వరితో కలిసి విజయవాడ కనకదుర్గను దర్శించుకున్నారు. చంద్రబాబు దంపతులను అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందించారు.
ప్రజానీకానికి సేవ చేసి రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. తెలుగు ప్రజలు సిరి సంపదలతో, ఆనందంగా జీవించేందుకు వారికి సేవ చేసే అవకాశం అమ్మవారు ప్రసాదిస్తారని నమ్ముతున్నానన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో..హైకోర్టు బెయిల్ తర్వాత వరుసగా ఆలయ పర్యటనలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ బెజవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. రాష్ట్రంలో మళ్ళీ పూర్వ వైభవం వచ్చి ప్రజలకు న్యాయం జరిగేలా ఆశీర్వచనం ఇవ్వమని దుర్గమ్మను కోరుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
విజయవాడకు వచ్చిన చంద్రబాబుకు ఎంపీ కేశినేని నాని, తెదేపా నేతలు కేశినేని చిన్ని, జనసేన నేత పోతిన మహేష్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, అశోక్‌బాబు, నేతలు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు, మాగంటి బాబు, బుద్దా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావు తదితరులు స్వాగతం పలికారు.