03-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8.30AM కి ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ పూర్తిచేయగా.. ఇప్పుడు ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్నారు.
కొన్ని చోట్ల తొలిరౌండ్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. తొలిరౌండ్లో గజ్వేల్లో కేసీఆర్ (బీఆర్ఎస్), ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు (కాంగ్రెస్), అశ్వారావుపేటలో ఆదినారాయణ (కాంగ్రెస్), గోషామహల్లో రాజాసింగ్ (భాజపా), హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్), ముషీరాబాద్లో ముఠా గోపాల్ (బీఆర్ఎస్), సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య (బీఆర్ఎస్), కామారెడ్డి, కొడంగల్లో రేవంత్ రెడ్డి (కాంగ్రెస్), సిరిసిల్లలో కేటీఆర్ (బీఆర్ఎస్) ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తుంగతుర్తిలో శామ్యూల్ (కాంగ్రెస్), మధిరలో మల్లు భట్టి విక్రమార్క (కాంగ్రెస్), ఆదిలాబాద్లో పాయల్ శంకర్ (భాజపా), భువనగిరిలో కుంభం అనిల్కుమార్రెడ్డి (కాంగ్రెస్), కొత్తగూడెంలో కూనంనేని సాంబశివరావు (సీపీఐ) కోరుట్లలో సంజయ్ (బీఆర్ఎస్), సిద్దిపేటలో హరీశ్రావు (బీఆర్ఎస్), హుస్నాబాద్లో పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్), సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్రెడ్డి (కాంగ్రెస్), నర్సాపూర్లో సునీతా లక్ష్మారెడ్డి (బీఆర్ఎస్), చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం), మేడ్చల్లో మల్లారెడ్డి (బీఆర్ఎస్), జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ (బీఆర్ఎస్) ముందంజలో ఉన్నారు. తొలిరౌండ్లో గజ్వేల్లో కేసీఆర్ 8,827 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్కుమార్రెడ్డికి 944 ఓట్ల ఆధిక్యం లభించింది. అక్కడ తొలిరౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్రెడ్డికి 4,865 ఓట్లు పోలవగా.. అనిల్క 5,809 ఓట్లు వచ్చాయి. మధిరలో కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క తొలిరౌండ్లో 2,098 ఓట్ల ఆధిక్యం కనబరిచారు. హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్) 2,380 ఓట్లతో లీడ్లో ఉన్నారు.