03-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో..కాంగ్రెస్ ఘన విజయం దిశగా దూసుకుపోతుంది. 119 నియోజకవర్గాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా.. దాదాపు 69 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది.. ఇప్పటికే హేమాహేమీలు భారీ విజయం సాధించారు. కొడంగల్ నుంచి పోటీ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై దాదాపు 32వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. రేవంత్ పోటీ చేసిన రెండో స్థానం కామారెడ్డిలో కూడా రేవంత్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఇక్కడ కేసీఆర్, బీజేపీ అభ్యర్థి కటిపల్లి వెంకట రమణ రెడ్డి కూడా గట్టి పోటీనిస్తున్నారు.
చెన్నూర్ లో వివేక్ వెంకటస్వామి గెలుపొందారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి గెలుపొందారు. హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడలో ఉత్తమ్ పద్మావతి రెడ్డి గెలుపొందారు. మెదక్ లో మైనంపల్లి రోహిత్ గెలుపొందారు. నకిరేకల్‌లో వేముల వీరేశం, నారాయణఖేడ్‌లో సంజీవరెడ్డి, జుక్కల్‌లో లక్మీకాంతరావు, నాగార్జునసాగర్‌లో జయవీర్‌రెడ్డి విజయం సాధించారు.
ఇప్పటివరకు ఉన్న సమాచార పత్రిక ట్రెండ్స్ ప్రకారం:
కాంగ్రెస్:- 66
బీఆర్ఎస్:- 45
ఎంఐఎం:- 4
బీజేపీ:- 3
సీపీఐ:- 1