03-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్: మొదటి నుండి అనుకున్నట్లే సనత్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుండి ఆఖరి రౌండ్ వరకు లీడింగ్ లోనే కొనసాగుతూ, చివరిదైన 14వ రౌండ్ ముగిసే నాటికి విజయం సాధించడం జరిగింది, దాదాపు 42,000 మెజార్టీ సాధించారు. సనత్ నగర్ నియోజకవర్గంలో ఏ మూల చూసినా మంత్రిగా తాను చేసిన అభివృద్దే కనిపిస్తుంది.
అన్ని డివిజన్లను సమానంగా చూస్తూ.. స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రజలతో మమేకమై కార్యకర్తలకు తలలో నాలుకలా వెన్నంటి ఉండేవారు. ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుండే తలసాని గెలుపు తో నియోజవర్గ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.
గవర్నమెంట్ కూడా వచ్చి ఉంటే బాగుండేదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు నిజానికి నియోజకవర్గానికి మంత్రిగా ఆయన చేసిన సేవలకు ఈ మెజార్టీ అసలు మెజార్టీయే కాదు!. ప్రజలు లక్ష ఓట్లతో గెలిపించాలి, కానీ వోటింగ్ శాతం తగ్గిన కారణంగా.. మెజార్టీ తగ్గినట్లుగా తెలుస్తోంది. లేకుంటే మెజార్టీ పెరిగేదని సమాచార పత్రిక విశ్లేషణ.
సనత్ నగర్ నియోజికవర్గం కాకుండా, మంత్రి తలసాని నగరంలోని కొన్ని నియోజకవర్గాలలో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కొరకు ప్రచారం చేయడం జరిగింది, వారు కూడా విజయం సాధించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు "జయీ భవా విజయీభవా".