03-12-2023 RJ
తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లోకి రావడానికి ప్రధాన కారణం పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాత్ర చెప్పుకోదగ్గది. మూడు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ సీన్లో కూడా లేదు. తెలంగాణలో టిఆర్ఎస్ అండ్ బీజెపిగా ఉండేది, కానీ ఆ తర్వాత కాంగ్రెస్ కేడర్ ని అప్రమత్తం చేసుకొని 2023 శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు.
ఆ తర్వాత సిఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క గురించి చెప్పుకోవాలి. ఆయన పాత్ర కూడా చెప్పుకోదగ్గది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లను కాంగ్రెస్లోకి ఆహ్వానించి రేవంత్ రెడ్డి విజయం సాధించారు.
ఇంకా.. బీఆర్ఎస్ నుండి హేమాహేమీలను పార్టీలోకి రప్పించి తాను ఏమిటో నిరూపించుకున్నారు. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ రెడ్డి కూడా తమ పాత్రను బాగానే పోషించారు.