04-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్: సనత్ నగర్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు నియోజకవర్గంలో నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. సనత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్రెడ్డి. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తన నివాసం లో కలిసి శాలువాలతో సన్మానించి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అలాగే ఎమ్మెల్యే తలసాని తను ఎప్పటి లాగే నిరంతరం ప్రజల్లో వుంటానని నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కొలను బాల్రెడ్డి, అమీర్పేట మాజీ కార్పొరేటర్ నామన శేషు కుమారి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.