05-12-2023 Super
తెలంగాణ
ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది. జిఎడి, ఐ అండ్ పీఆర్, పోలీసులు సోమవారం రాత్రి రాజ్ భవన్ నుంచి వెళ్లిపోతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సీఎం చేయకూడదని కొందరు సీనియర్లు గట్టిగా చెప్పడంతో కాంగ్రెస్ లో అప్పుడే సంక్షోభం మొలైనట్లు కనిపిస్తోంది.
కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో సీఎల్పీ నేతగా ఎవరనేది తేలలేదు. సీఎం వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో ఢిల్లీలోనే విషయం తేల్చేందుకు అధిష్టానం సిద్ధమైంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. దాంతో డీకే సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్తున్నారు. డీకేతో పాటు మరో నలుగురు పరిశీలకులను ఢిల్లీకి పిలిచింది అధిష్టానం. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్, ఏఐసీసీ అగ్ర నేతలు మంగళవారం ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశం కానున్నారు.