05-12-2023 Super
ఆంధ్రప్రదేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు తూఫాను తీవ్రత కారణంగా తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఈ మేరకు తెదేపా వర్గాలు వెల్లడించాయి.
యువగళం ముగింపు సభ భారీగా ప్లాన్ - చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు దశకు వచ్చింది. మరో 12 రోజుల్లో ముగింపు సభ నిర్వహించనున్నారు. డిసెంబరు 17న భీమిలి నియోజకవర్గంలో సభ ఉంటుందని టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. పాదయాత్ర ముగింపు సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా రప్పించనున్నట్లుగా పల్లా శ్రీనివాస్ వెల్లడించారు.
లోకేశ్ యువగళం పాదయాత్ర ఈ నెల 6 తేదీకి అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చేరుకుంటుంది. పాయకరావుపేట నుంచి ఈ నెల 7వ తేదీన యువగళం పాదయాత్ర మొదలై, ఈ నెల 17వ తేదీన భీమిలి నియోజకవర్గంలో ముగియనుంది. చెప్పారు. యువగళం ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
అరకు పార్లమెంట్ అధ్యక్షుడు, అరకు, గుడివాడ నియోజకవర్గాల ఇంచార్జ్ ల నియామకాలు.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అరకు పార్లమెంట్ అధ్యక్షులుగా కిడారి శ్రావణ్ కుమార్ ని, అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ గా సియ్యారి దొన్నుదొరని నియమించారు. గుడివాడ నియోజకవర్గ ఇంచార్జ్ గా వెనిగండ్ల రాముని నియమించారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.