05-12-2023 Super
తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. కానీ.. హైదరాబాద్ మహానగరం మరియు హైదరాబాద్ చుట్టూరా ఉన్న నియోజకవర్గాలను సిటీ ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరించారు.
ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు కనిపించడమే కారణం. ఈ మెగాసిటీలో వేలాదిగా ఐటీ కంపెనీలను తీసుకువచ్చి లక్షలాదిగా ఉద్యోగాల సృష్టించటం చాలా ఉపయోగప పడిందని చెప్పుకోవచ్చు. ఇదొక్కటే కాదు హైదరాబాద్ మహానగరానికి వివిధ రాష్ట్రాల నుండి ఎందరో వ్యాపారాల నిమిత్తం ప్రైవేటు ఉద్యోగాల కొరకు ఫ్యామిలీతో వచ్చి స్థిరపడటం జరిగింది.
ఇటువంటి ఫ్యామిలీలు కూడా టిఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్లుగా మనకు అర్థమవుతుంది. కానీ తెలంగాణ జిల్లాల్లో మెజార్టీ జిల్లాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ని వ్యతిరేకించి కాంగ్రెస్కు మద్దతుగా ఓటు వేయడం జరిగింది. జిల్లాల్లోని మంత్రులు సైతం కొందరు ఓటమి చెందడం తెలిసిందే. బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశమై, ఆ తర్వాత ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కి అందరూ కలిసి వెళ్లి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని కలిసి కౌంటింగ్ ప్రక్రియ తదితర విషయాలను చర్చించడం జరిగింది.
ఎన్నికైన శాసనసభ్యులను పేరుపేరునా కేసీఆర్ అభినందనలు తెలిపారు. అందరూ అప్రమత్తంగా ఉండండి నిరాశ చెందవద్దు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత వారు ఇచ్చిన హామీలు నెరవేర్చి విధంగా పట్టుపడదాం అని ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది.
తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ విషయం తీసుకుంటే టి.పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాత్ర చెప్పుకోదగ్గది. ఎందుకంటే మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ కాంగ్రెస్ అసలు సోదిలోనే లేదు, రేవంత్ పగ్గాలు చేపట్టాక కాంగ్రెస్లో జోరు పెరిగింది. శాసనసభ ఎన్నికలు దగ్గర పడేకొద్దీ వేరే పార్టీల ముఖ్య నాయకులను కాంగ్రెస్లోకి తీసుకొచ్చి పార్టీలో జోష్ నింపారు రేవంత్.
ఆ విధంగా ఈ ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత రేవంత్ సాధించారు. కానీ కౌంటింగ్ పూర్తి అయ్యి స్పష్టమైన రిజల్ట్ వచ్చి రెండు రోజులు పూర్తయిన ఇంకా సీఎల్పీ లీడర్ ఎన్నిక పూర్తి కాకపోవడానికి కారణం రేవంత్ రెడ్డి అంటే పడని కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకుల ప్రవర్తనగా చెప్పుకోవాలి. అందువలన సీన్ ఢిల్లీకి మారింది.
అరిస్టానంత దృష్టిలో పడటానికి కొందరు ముఖ్యనాయకులు ఢిల్లీ వెళ్లడం జరిగింది. సిఎల్పీ పోటీలో మేము ఉన్నానని కూడా ఉత్తమ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క అడ్డు చక్రం వేస్తున్నారు. ఈ కారణంగా రేవంత్ పేరుని అధికారికంగా ప్రకటించడం లేట్ అవుతుందని భావించవచ్చు. ఉదయం నుంచి ఢిల్లీలో.. మల్లికార్జున ఖర్గే నివాసంలో సమాలోచనలు జరిగాయి, సాయంత్రం కెసి వేణుగోపాల్ నివాసంలో చర్చలు జరిపారు. హైదరాబాదులోని ఎల్లా హోటల్ లో రేవంత్ రెడ్డి, హోటల్ లో ఉన్న ఎమ్మెల్యేలని విడివిడిగా కలిసి మాట్లాడటం జరిగింది. అధిష్టానం నుండి పిలుపు రావడం తో రేవంత్ ఢిల్లీ పయనం.
ఫ్లాష్..ఫ్లాష్.. రేవంత్ రెడ్డి సీఎంగా లైన్ క్లియర్, డిప్యూటీ సీఎం మరియు మంత్రులుగా ఎవరు అనేది త్వరలో తెలియనుంది.