06-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్: యునైటెడ్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ సనత్ నగర్ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ సెలెబ్రేషన్స్ ను, సనత్ నగర్ లోని లేబర్ వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్ నందు డిసెంబర్ 9న (శనివారం) నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వారి నివాసంలో, కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. అనంతరం.. సనత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్ రెడ్డి నీ కూడా ఆహ్వానించారు. అందుకు వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా వస్తాను అని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా యు సి డబ్ల్యూ ఏ అధ్యక్షులు బ్రదర్ బి. జి. విలియం మాట్లాడుతూ .. శనివారం నాడు సనత్ నగర్ లోని లేబర్ వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్ లో నిర్వహించనున్న యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్ కు ప్రముఖ వర్తమానికులు డా.రెవ కోన శౌరీ బాబు (ఇజ్రాయెల్ వర్డ్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్ కు గుడ్‌విల్ అంబాసిడర్) వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి క్రైస్తవ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పత్రిక ప్రకటన లో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి. జి. విలియం యునైటెడ్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రకాష్, రమేష్, అనిల్ కుమార్ (బప్పా), సైమన్ రాజు తదితరులు పాల్గొన్నారు.