06-12-2023 Super
తెలంగాణ
హైదరాబాద్: డా.బీ.అర్.అంబేద్కర్ ఆశయాలైన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు డాక్టర్ కోటా నిలిమ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని ప్రకటించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గంలోని బాన్సిలాల్ పెట్ డివిజన్లోని జబ్బర్ కాంప్లెక్స్, సీసీ నగర్, ఐ డి హెచ్ కాలనీ, పద్మారావు నగర్, బేగంపేట్ డివిజన్లోని పార్టీ గడ్డ వద్ద అంబేద్కర్ విగ్రహాల వద్ద డాక్టర్ కోట నీలిమ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలవేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పాలనలో దేశంలో ప్రతి పౌరుడికి ప్రజాస్వామ్యం ఫలాలు దక్కుతాయని ప్రకటించారు. సీసీ నగర్ లోని అంబేడ్కర్ విగ్రహానికి మెట్ల నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి వ్యక్తి ప్రభుత్వ పథకాల కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సంప్రదించాలని వారి వింనతులు స్వీకరించి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిరంజీవి, సనత్ నగర్ నియోజకవర్గం ఎస్సీ సెల్ చైర్మన్ జీ ఎల్ రమేష్, మల్లం రమేష్, దేవానంద్, కల్పన, ఉష తదితరులు పాల్గొన్నారు.