07-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పదకొండు మంది సీనియర్ నేతలు మంత్రులుగా ప్రమాణం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈమేరకు రాజ్‌భవన్‌కు మంత్రుల జాబితాను పంపించారు.
మంత్రులుగా ప్రమాణం చేయనుంది వీరే:
- మల్లు భట్టి విక్రమార్క (డిప్యూటీ సీఎం)
- ఉత్తమ్ కుమార్ రెడ్డి
- శ్రీధర్ బాబు
- సీతక్క
- కోమటి రెడ్డి వెంకట రెడ్డి
- తుమ్మల నాగేశ్వర్ రావు
- పొన్నం ప్రభాకర్
- కొండా సురేఖ
- దామోదర రాజనర్సింహ
- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- జూపల్లి కృష్ణారావు
ప్రమాణస్వీకారానికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీఐపీలు, ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన పోలీసులు..ఈ కార్యక్రమానికి పోలీసులు అందుకు తగ్గట్టుగానే భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.